ఉప్పెన' క్లైమాక్స్ ట్రోల్స్ పై వైష్ణవ్ తేజ్ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
ఉప్పెన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రమాదకరమైన సన్నివేశం ఒకటుందనీ, దానిని ఎలా కన్విన్స్ చేస్తారనే దానిపై సినిమా ఆధారపడి ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం వదులుకుంటాడని, అదే ఆ ప్రమాదకరమైన పాయింట్ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై వైష్ణవ్ తేజ్ స్పందించాడు.
"సోషల్ మీడియా ప్రచారంలో పూర్తి వాస్తవాలు లేవు. ప్రేక్షకులు సినిమా చూశాక క్లైమాక్స్ గురించి మాట్లాడతాను. అందులో దైవత్వం ఉంది. సినిమాలో హీరోయిన్ మీద హీరోకి, హీరోపై హీరోయిన్ కి, కుమారుడు పై హీరో తండ్రికి ఉప్పెనంత ప్రేమ ఉంటుంది. అందుకే ఉప్పెన అనే టైటిల్ పెట్టారు. అయితే క్లైమాక్స్ సన్నివేశం టైటిల్ కి అసలు సిసలైన జస్టిఫికేషన్ ఇస్తుంది" అని వైష్ణవ్ తేజ్ చెప్పాడు. ఈ వారంలోనే సినిమా విడుదల అవుతోంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout