వైష్ణవ్ నెక్ట్స్ కూడా డెబ్యూ డైరెక్టర్‌తోనే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో సాయతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పంజా కూడా ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2నే విడుదల కావాల్సిన ‘ఉప్పెన’ కరోనా దెబ్బకు వాయిదా పడింది. అసలు ఎప్పుడు విడుదలవుతుందో తెలియడం లేదు. ఈ సినిమా విడుదల కాకుండానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. వివరాల మేరకు స్టార్‌తో పెద్ద పెద్ద భారీ చిత్రాలను తెరకెక్కించే యువీ క్రియేషన్స్ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తుంటుంది. అలాంటి ఓ పరిమిత బడ్జెట్ మూవీని ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని కూడా డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తుండటం.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డెబ్యూ డైరెక్టర్‌గా తెరకెక్కించిన ఉప్పెన విడుదలకు సిద్ధంగా ఉండగానే, మరో డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి వైష్ణవ్ ఓకే చెప్పేశాడు. ఇప్పటికే సాయితేజ్, వైష్ణవ్ తేజ్‌లకు కథ వినేశారట. వీరికి కథ బాగా నచ్చిందని టాక్. కరోనా ప్రభావం బాగా తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com