మరో డేరింగ్ స్టెప్.. హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్

  • IndiaGlitz, [Monday,May 17 2021]

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ఉప్పెనతోనే ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి చిత్రంగా ఉప్పెన లాంటి కథ ఎంచుకోవడం డేరింగ్ స్టెప్పే అని చెప్పాలి. ఉప్పెన రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ కాదు. ఎంతో ఇంటెన్స్ ఉన్న ప్రేమ కథ. తొలి చిత్రం అయినప్పటికీ వైష్ణవ్ అద్భుతంగా మెప్పించాడు. వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రాలకు సంబంధించి పలు నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
 
వైష్ణవ్ తేజ్ డెబ్యూ దర్శకుడు పృధ్వి దర్శకత్వంలో ఓ చిత్రానికి సైన్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వైష్ణవ్ మరో వైవిధ్యభరితమైన రోల్ ప్లే చేయనున్నాడు. హాకీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వైష్ణవ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడట. కమర్షియల్ చిత్రాలు కాకుండా పెర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉన్న కథలపైనే వైష్ణవ్ ఫోకస్ పెడుతున్నాడు.
 
కథకు తగ్గట్లుగా ఈ చిత్రం కోసం వైష్ణవ్ తన మేకోవర్ ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటనతోపాటు చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు వెలువడనున్నాయి.

More News

తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు బంద్...

తెలంగాణలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. తగినంత నిల్వ లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున

2 డీజీ డ్రగ్‌ను నేడు విడుదల చేయనున్న రాజ్‌నాథ్

కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) నేడు అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం

రఘురామకు తీవ్ర గాయాలు..హైకోర్టు డివిజనల్ బెంచ్ ఫైర్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలుడటం సంచలనంగా మారింది. తనను సీఐడీ పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు.

కాల్ చేయండి.. క్షణాల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ మీ ఇంటికే పంపిస్తాం: సోనూసూద్

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. కాస్తో కూస్తో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్ పెట్టి కరోనా చైన్‌ను తెంపేందుకు కృషి చేస్తున్నాయి.

ఆక్సిజన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి: సీపీ మహేష్ భగవత్

కరోనా ఉధృతి మరింత పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ కొరత ప్రాణాలను హరించి వేస్తోంది. సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు చాలా మంది ఊపిరి వదులుతున్నారు.