Aadikeshava:ఊర మాస్‌గా మెగా హీరో.. 'ఆదికేశవ' ట్రైలర్ రిలీజ్..

  • IndiaGlitz, [Monday,November 20 2023]

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ' నుంచి ట్రైలర్ విడుదలైంది. లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్‌తో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్‌గా నటించాడు. ఇక సీనియర్ హీరోయిన్ రాధిక, అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రల్లో నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఓ క్వారీ విషయంలో విలన్స్‌పై హీరో శివతాండవం ఆడుతున్నట్లు.. వైష్ణవ్ తేజుని యాక్షన్ సీక్వెన్స్‌లో ఊర మాస్‌గా ఇందులో చూపించారు. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఆసక్తి రేపి సినిమాపై అంచనాలు రేపింది. ఈ నెల 24వ తేదీన మూవీ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీ పెంచింది.

వైష్ణవ్ సినిమాల విషయానికొస్తే తొలి చిత్రం 'ఉప్పెన'తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. రెండో సినిమా 'కొండపొలం' కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా అందులో తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. మూడో చిత్రం 'రంగరంగ వైభవంగా' మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లే మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. బాడీ పెంచి మాస్ హీరో లాగా మారిపోయాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో తెలియాలంటే నవంబర్ 24వరకు వెయిట్ చేయాల్సిందే.

More News

Trisha:త్రిష గురించి మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలు దేశవ్యా్ప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..

గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని

CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో

CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు.

Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ