మెగాస్టార్‌తో పాటు మహేష్, ఎన్టీఆర్‌లను బీట్ చేసిన వైష్ణవ్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే అదరగొడుతున్నాడు. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే వసూళ్ల ‘ఉప్పెన’ సాగిస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ కూడా కొత్తవారే అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అరంగేట్ర సినిమాతోనే వైష్ణవ్ అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది.
అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైష్ణవ్ తన మామ మెగాస్టార్‌ను వసూళ్లలో బీట్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ‘ఖైదీ నంబర్ 150’తో ఇచ్చి విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్లను వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమా బీట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
‘ఉప్పెన’ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ మూడు రోజుల కలెక్షన్లతోనే `ఉప్పెన` చిత్రం.. `ఖైదీ నెంబర్ 150`ని కూడా క్రాస్ చేసేసిందని వార్తలు వస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తొలి మూడు రోజుల కలెక్షన్ల విషయంలో ‘ఉప్పెన’ సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `మహర్షి`, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ కూడా బీట్ చేసిందట. తొలి సినిమాతోనే రికార్డు కలెక్షన్లు సాధించిన హీరోగా వైష్ణవ్ నిలిచాడు. నేడు ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్‌డే సందర్భంగా ‘ఉప్పెన’ నిర్మాణ సంస్థ రూ.50 కోట్ల పోస్టర్‌ను విడుదల చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com