'వైశాఖం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
- IndiaGlitz, [Wednesday,May 10 2017]
'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'వైశాఖం'. ఆర్.జె. సినిమాస్ పతాకంపై హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా....
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ -వైశాఖం ట్రైలర్ చాలా బావుంది. అచ్చమైన తెలుగు టైటిల్. టైటిల్ సౌండింగ్ చాలా బావుంది. వినగానే పాజిటివ్‌గా అనిపించింది. టైటిల్ వినగానే సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకున్నాను. కానీ ఇది పక్కా కమర్షియల్ మూవీ అని ట్రైలర్ చూడగానే తెలిసింది. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి జయగారికి, బి.ఎ.రాజుగారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. బి.ఎ.రాజుగారికి సినిమాలంటే ప్యాషన్, నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఏ సినిమా గురించైనా పూర్తి అవగాహన ఉంటుంది. నేను ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచి జయగారిని చూస్తున్నాను. ఆ టైంలో చాలా సినిమాలు చేశారు. అవన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రం కూడా డెఫనెట్‌గా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇండస్ట్రీలో అందరూ లేడీ డైరెక్టర్స్, జెంట్ డైరెక్టర్స్ అంటుంటారు కానీ డైరెక్టర్ ఎవరైనా డైరెక్టరనేది నా అభిప్రాయం. లేడీ డైరెక్టర్ అని సపరేట్ చేసి మాట్లాడటం మానేయాలి. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
డైనమిక్ డైరెక్టర్ జయ.బి మాట్లాడుతూ - ''మొదటి నుండి నాని అంటే నాకు చాలా ఇష్టం. చాలా నేచురల్‌గా పెర్‌ఫార్మెన్స్ చేస్తాడు. అలాంటి నానితో కచ్చితంగా సినిమా చేయాలని అనుకుని చేయలేకపోయాను. ఫ్యూచర్‌లో తప్పకుండా నానితో సినిమా చేస్తాను. లవ్‌లీ, వైశాఖం చిత్రాలకు ఎడిటింగ్ చేశాను. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఓ ఉమెన్ డైరెక్టర్ ఎడిటింగ్ చేయడమనేది చాలా రేర్. వైశాఖం అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''అష్టాచమ్మా రీసెంట్‌గా మజ్ను, ఇప్పుడు నిన్నుకోరి సినిమాపి.ఆర్.ఒ. గా చేస్తున్నాను. హీరోగా నాని చాలా పెద్ద రేంజ్‌కు వెళ్ళారు. అయిన చాలా సింపుల్‌గా ఉంటారు. సెలక్టివ్‌గా కథలను ఎంపిక చేసుకుంటూ వరుసగా సూపర్‌హిట్ సినిమాలు చేస్తున్నారు. ఆడియెన్స్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ హ్యాపీగా ఉంచుతున్నారు. నానితో సినిమా చేస్తే, మినిమమ్ గ్యారంటీ హిట్ అవుతుంది. చాలా సేఫ్ జోన్‌లో ఉంటామని నిర్మాతలకు నమ్మకాన్ని కలిగించారు. సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎంసిఎ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి కూడా మాపై అభిమానంతో వైశాఖం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా ఆడియో విడుదలై, సాంగ్స్ అన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. వైశాఖం చిత్రాన్ని జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ - ''వైశాఖం చాలా మంచి సినిమా. సమ్మర్‌లో కూల్ లస్సీలాంటి సినిమా. ఈ సినిమాకు లక్ బాగా తోడైంది. సూపర్‌స్టార్ మహేష్ ఆడియో విడుదల చేశారు. ఆడియో పెద్ద హిట్. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ట్రైలర్ విడుదల చేశారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. వైశాఖం నాకు నటుడుగా 100వ సినిమా కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ - ''వైశాఖం సినిమాకు బిఎరాజుగారు, జయగారు చాలా స్వేచ్ఛనిచ్చి పని చేయించారు. అవకాశం ఇచ్చిన జయగారికి, రాజుగారికి థాంక్స్'' అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ - ''వైశాఖం నా మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నాకు చాలా మంచి మనుషులు దొరికారు. ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వైశాఖం వంటి మంచి సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. జూన్ మొందటి వారంలో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంత మంచి సినిమా చేసే అవకాశాన్ని కల్పించిన బిఎరాజుగారు, జయగామేడమ్‌కు థాంక్స్'' అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.