ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే 'వైశాఖం'
Monday, February 13, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్‌లీ వంటి లవ్‌స్టోరీస్‌ని అందించిన ఆర్.జె.సినిమాస్ బేనర్ నుంచి మరో ప్రేమకథా చిత్రం 'వైశాఖం' వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీడైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 'వైశాఖం' చిత్ర విశేషాలను తెలియజేశారు.
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ - ''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. వైశాఖ మాసానికి చాలా ప్రాముఖ్యత, ఎంతో పవిత్రత వుంది. అందుకే ఈ మాసంలోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే. 'వైశాఖం' చిత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఒక అమ్మాయి వైశాఖంలా ఒక అబ్బాయి జీవితంలోకి ఎంటర్ అయి అతనిలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది, వీరి ప్రేమ ప్రయాణం వైశాఖంలో పెళ్ళి వరకు ఎలా వెళ్ళింది అనేది కథ. స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా వుంటుంది'' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, గుండమ్మగారి మనవడు ఇవన్నీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీస్. లవ్‌లీ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్‌స్టోరీ. మా బేనర్‌లో లవ్ ఓరియంటెడ్ మూవీసే ఎక్కువగా తీశాము. అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన డిఫరెంట్ లవ్‌స్టోరీ 'వైశాఖం'. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్‌గా జరుగుతోంది. బిజినెస్‌పరంగా చాలా మంచి ఆఫర్స్ వున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ - ''వైశాఖం వంటి మంచి సినిమాలో చెయ్యడం నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా వుంది. ఈ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ వుంటాయి. నన్ను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ జయగారికి, నిర్మాత బి.ఎ.రాజుగారికి నా కృతజ్ఞతలు. లవర్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేసే ఈ సినిమా ఫ్యామిలీస్‌ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది'' అన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేశాను. చాలా మైన్యూట్ డీటైల్స్ కూడా డైరెక్టర్ జయగారు ఎంతో కేర్ తీసుకొని తీసారు. ఈ సినిమా చేయడం థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. నా ఫ్యూచర్‌కి జయగారి 'వైశాఖం' గట్టి ఫౌండేషన్ అవుతుంది. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే మంచి లవ్‌స్టోరీ'' అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments