వైశాఖం యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగిన హీరో హరీష్ జన్మదిన వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వైశాఖం. ఆర్.జె. సినిమాస్ పతాకంపై సూపర్‌హిట్ అధినేత బి.ఎ.రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హరీష్ - అవంతిక జంటగా నటిస్తున్నారు. ఈ రోజు వైశాఖం చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న హరీష్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా హరీష్ జన్మదిన వేడుకలు చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ...వైశాఖం షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి హరీష్ ఎవరు అని అడుగుతున్నారు. తొలి సినిమాతోనే హరీష్ మంచి పేరు తెచ్చుకుంటాడు. లవ్ లీ కంటే వైశాఖం పెద్ద హిట్ అవుతుంది. సాయికుమార్ ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి సాయికుమార్ కూడా రావాలి. కాకపోతే సాయికుమార్ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో బెంగుళూరులో బిజీగా ఉండడం వలన రాలేదు. ఈ చిత్రానికి వసంత్ మంచి మ్యూజిక్ అందించాడు. మా బ్యానర్ లో ఈ చిత్రం ద్వారా చాలా మందిని పరిచయం చేస్తున్నాం. ఆగష్టు, సెప్టెంబర్ లో చేసే షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తవుతుంది. హీరో హరీష్ రెండవ చిత్రాన్ని కూడా మా బ్యానర్ లోనే చేయనున్నాం. వైశాఖం ఖచ్చితంగా 2016లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు.
నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ...ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి చిత్రమిది. డైరెక్టర్ జయ గారు చాలా కూల్ గా ఉంటారు. ఆమె లాగే సినిమా కూడా అందరూ చూసేలా ఉంటుంది. జయ గారు సినిమా సినిమాకి గ్యాప్ వచ్చినా మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో లేట్ అయినా మంచి సినిమాలను అందిస్తున్నారు. వైశాఖం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుంది అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ...నాకు వైశాఖం ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా బర్త్ డేను యూనిట్ మెంబర్స్ సమక్షంలో ఇంత గ్రాండ్ గా చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత రాజు గారు, డైరెక్టర్ జయ గారు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మరువలేను. నా రెండవ చిత్రాన్ని కూడా ఇదే బ్యానర్ లో చేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ జయ మాట్లాడుతూ...వైశాఖం కథ రాసుకున్న తర్వాత ఈ కథకు చాలా మంది హీరోలను అనుకున్నాను. ఎవరూ సెట్ కాలేదు. అయితే ఒక రోజు హరీష్ ను చూడగానే ఈ కథకు కరెక్ట్ గా సరిపోతాడు అనిపించింది. ఎంటర్ టైన్మెంట్, సెంటిమెంట్, యాక్షన్...ఇలా ఏ ఎమోషన్ కావాలంటే...అది చేస్తున్నాడు. ఇలా...అన్ని ఎమోషన్స్ ను కరెక్ట్ గా చేయగలగడం అనేది రేర్ క్వాలిటీ. అలాగే ఎంత సీనియర్ ఏక్టర్ తో అయినా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజ్ తో నటిస్తున్నాడు. ఇండస్ట్రీకి మరో మంచి హీరోను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.ఇక సినిమా గురించి చెప్పాలంటే... నా మనసుకు బాగా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అలాగే నన్ను బాగా కష్టపెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. అయితే వినోదమే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్టు నేను అనుకున్న దానికంటే బాగా నటించారు. జబర్ధస్త్ అప్పీ క్యారెక్టర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. మా కెమెరామెన్ సుబ్బారావు గారు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు వైశాఖం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గుండు సుదర్శన్, సంగీత దర్శకుడు వసంత్, భద్రమ్, జబర్ధస్త్ శేషు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments