రష్యా కజక్ స్ధాన్ లో షూటింగ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ వైశాఖం

  • IndiaGlitz, [Monday,May 30 2016]
చంటిగాడు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ల‌వ్ లీ...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి తాజా చిత్రం వైశాఖం. ఈ చిత్రాన్ని ఆర్.జె.సినిమాస్ బ్యాన‌ర్ పై బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు. నూత‌న న‌టీన‌టులు హ‌రీష్, అవంతిక జంట‌గా న‌టిస్తున్న‌వైశాఖం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పాట‌ల చిత్రీక‌ర‌ణ ర‌ష్యా నుండి సెప‌రేట్ అయిన క‌జ‌క్ స్థాన్ లో 15 రోజులు పాటు జ‌రిగింది. క‌జ‌క్ స్టాన్ దేశంలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి ఇండియ‌న్ సినిమా వైశాఖం అవ్వ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కురాలు జ‌య మ‌రియు టీమ్ అంద‌ర్నీ క‌జ‌క్ స్టాన్ ప్ర‌భుత్వం త‌మ కంట్రీలో షూటింగ్ చేస్తున్నందుకు అభినంద‌న‌లు తెలిపి వైశాఖం యూనిట్ ని స‌త్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత బి.ఎ.రాజ మాట్లాడుతూ...జ‌య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్ గా సూప‌ర్ హిట్స్ అయ్యాయి. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌లో జ‌య ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు క‌నుక‌నే ఆమె ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రాల్లో పాట‌ల‌న్నీ ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ల‌వ్ లీ కోసం ట‌ర్కీలో తీసిన రెండు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈసారి వైశాఖం చిత్రం పాట‌ల‌కు కొత్త లోకేష‌న్స్ కి వెళ్లాల‌ని ఎన్నో కంట్రీస్ లోని లోకేష‌న్స్ చూసాక క‌జ‌క్ స్ధాన్ లో అద్భుత‌మైన లోకేష‌న్స్ లో ఉన్నాయ‌ని తెలుసుకున్నాం. ఇంత వ‌ర‌కు ఎవ‌రూ అక్క‌డ షూటింగ్ చెయ్య‌లేద‌ని తెలుసుకుని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి 15 రోజుల పాటు క‌జ‌క్ స్ధాన్ లో మూడు పాట‌ల్నిఅద్భుతంగా చిత్రీక‌రించాం. ఈ పాట‌ల‌కు వి.జె.శేఖ‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌పీ వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు ఎక్స్ ట్రార్డిన‌రీగా ఈ పాట‌ల‌ను తెర‌కెక్కించారు.
7 రోజుల పాటు క‌జ‌క్ స్ధాన్ లోని అంద‌మైన లోకేష‌న్స్ ఆస్ధానాలోని ఖాన్ షాటిర్, నుర్ అస్తానా మాస్క్, ప్యాలెస్ ఆఫ్ పీస్, నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ మోనుమోంట్, ఫ‌స్ట్ ప్రెసిడెంట్ హాల్, సెంట్ర‌ల్ డౌన్ టౌన్, బైటెరెక్ ట‌వ‌ర్, ఆస్తానా ఎరేనాల‌లో 8 రోజుల పాటు ఆల్ మేటీలోని పాన్ ఫిలోవ్ పార్క్, యాసెన్ష‌న్ కెతెడ్ర‌ల్ డుమ‌న్ ఎంట‌ర్ టైన్మెంట్, చారిన్ కాన్ యాన్ రేడియా ట‌వ‌ర్, బిగ్ ఆల్ మేటీ లేక్, నోమాడ్ మూవీ సెట్, సెంట్ర‌ల్ పార్క్ లోని డాల్ఫిన్ షోల‌లో ఈ 3 పాట‌ల‌ను చిత్రీక‌రించ‌డం జ‌రిగింది. దాదాపు 7 నుండి 8 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్ తో తీస్తున్న సినిమా వైశాఖం. క‌థ మీద న‌మ్మ‌కంతో ఏ విష‌యంలోను కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. క‌జ‌క్ స్ధాన్ షెడ్యూల్ తో 60 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. జూన్, జులై, ఆగ‌ష్టు ల‌లో జ‌రిగే షెడ్యూల్స్ తో చిత్రం పూర్త‌వుతుంది. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తో నిర్మిస్తున్న వైశాఖం 2016లో డెఫినెట్ గా ఓ సూప‌ర్ హిట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత‌గా నాకు, ద‌ర్శ‌కురాలిగా జ‌య‌కు ఈ చిత్రం గొప్ప ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు.
హ‌రీష్, అవంతిక జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని, ఓ ముఖ్య‌పాత్ర‌లో, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌మాప్ర‌భ‌, పృథ్వీ, కాశీ విశ్వ‌నాథ్, కృష్ణ‌భ‌గ‌వాన్, శ్రీల‌క్ష్మీ, గుండు సుద‌ర్శ‌న్, భ‌ద్రం, సంపూ, ఫ‌ణి, మాధ‌వి, జెన్నీ, జ‌బ‌ర్ధ‌స్త్ టీమ్ వెంకీ, శ్రీధ‌ర్, రాంప్రసాద్, ప్ర‌సాద్, తేజ‌, ల‌తీష్, శృతినాయుడు, క‌ళ్యాణి, కుమారి, మోనిక‌, చాందిని, ఇషాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు, సంగీతం డి.జె.వ‌సంత్, డ్యాన్స్ వి.జె.శేఖ‌ర్, ఆర్ట్ ముర‌శి కొండేటి, స్టిల్స్ శ్రీను, కో డైరెక్ట‌ర్ అమ‌ర‌నేని న‌రేష్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ సుబ్బారావు, లైన్ ప్రొడ్యూస‌ర్ బి.శివ‌కుమార్, నిర్మాత బి.ఎ.రాజు, ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం జ‌య బి.