వినోదంతో పాటు మంచి సందేశం అందించే విభిన్నకథా చిత్రం వైశాఖం
Send us your feedback to audioarticles@vaarta.com
చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ...ఇలా విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ జయ.బి తాజా చిత్రం వైశాఖం. ఈ చిత్రాన్ని ఆర్.జె.సినిమాస్ బ్యానర్ పై బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు. నూతన నటీనటులు హరీష్, అవంతిక జంటగా నటిస్తున్నవైశాఖం చిత్రం ఒక ఎపిసోడ్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఎ.రాజ మాట్లాడుతూ...ఈ చిత్రం చిన్న ఎపిసోడ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దీపావళికి మొత్తం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు తీసాం. ఈ ఆరు సినిమాలు రూపొందించేటప్పుడు కాస్త టెన్షన్ పడుతూ చేసాం కానీ...వైశాఖం మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతిరోజు షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ చిత్రంలో ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన బిజీగా ఉన్నప్పటికీ మాపై ఉన్న గౌరవంతో ఈ క్యారెక్టర్ చేసినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాం. ఓ మంచి సినిమా చేస్తున్నందుకు మా యూనిట్ అంతా చాలా గర్వంగా ఫీలవుతున్నాం. జయ మనసుకు బాగా దగ్గరగా ఉండే సినిమా ఇది అన్నారు.
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ...లేడీ డైరెక్టర్ జయ గారితో వర్క్ చేయాలని లవ్ లీ టైమ్ లో కలిసాను. కానీ...అప్పటికే ఆ సినిమాకి కొరియోగ్రాఫర్ ఫిక్స్ అవ్వడం వలన కుదరలేదు. వైశాఖం సినిమాకి సంబంధించి రెండు పాటలుకు కొరియోగ్రఫీ చేయడానికి జయ మేడమ్ పిలిచారు. ఆఖరికి రెండు పాటలు మాత్రమే కాకుండా ఈ చిత్రంలోని అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉంది. హీరో హరీష్ మాస్ హీరో మాత్రమే కాదు క్లాస్ హీరోగా కూడా ఆకట్టుకుంటాడు. వసంత్ సంగీతం, సుబ్బారావు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ఎస్సెట్ అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ...నేను రిలేషన్స్ & ఎమోషన్స్ కి ప్రాముఖ్యత ఇస్తాను. అందుచేతనే ఈ మూవీ అంగీకరించాను. ఈ చిత్రంలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మంచి సినిమాగా నిలుస్తుంది.అన్నారు.
డైరెక్టర్ జయ మాట్లాడుతూ...వైశాఖం చిత్రం చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వర్క్ చేసారు. మా సినిమా టోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు బాడీ గింబ్లి టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలిజీని రోబో సీక్వెల్ 2.0 చిత్రానికి ఉపయోగిస్తున్నారు. అలాగే వసంత్ చాలా మంచి ట్యూన్స్ అందించారు. రావూరి కృష్ణ సంభాషణలు అందించారు. ఈ చిత్రం ద్వారా హీరో హరీష్ ను పరిచయం చేస్తున్నాం. హీరో హరీష్ & హీరోయిన్ అవంతిక పాత్రలకు తగ్గట్టు చాలా బాగా నటించారు. ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, శేషు లైన్ ప్రొడ్యూసర్, బి. శివకుమార్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరీ రావు, రమాప్రభ, గుండు సుదర్శన్, భద్రం, సంపూ, ఫణి, మాధవి, జెన్నీ, జబర్ధస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం డి.జె.వసంత్, డ్యాన్స్ వి.జె.శేఖర్, ఆర్ట్ మురశి కొండేటి, స్టిల్స్ శ్రీను, కో డైరెక్టర్ అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్ బి.శివకుమార్, నిర్మాత బి.ఎ.రాజు, రచన దర్శకత్వం జయ బి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com