అన్ని అబ‌ద్ధాలే.. సిద్ధ‌మే: వైర‌ముత్తు

  • IndiaGlitz, [Monday,October 15 2018]

మీ టూ ఉద్య‌మం బాలీవుడ్‌లో త‌నుశ్రీ దత్తా స్టార్ట్ చేసింది. ప‌లువురు మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ద‌క్షిణాదిన సింగ‌ర్ చిన్మ‌యి మీ టూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేసింది.

చిన్మ‌యి ఏకంగా త‌మిళ స్టార్ లిరిక్ రైట‌ర్ వైర‌ముత్తుపైనే లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై వైర‌ముత్తు ఓ వీడియో విడుద‌ల చేశారు. ''చిన్నయి చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలే. అవి నిజ‌మైతే కేసు పెట్టొచ్చు. నేను మంచి వాడినో..చెడ్డ‌వాడినో ఎవ‌రో చెప్ప‌న‌క్క‌ర్లేదు. న్యాయ‌స్థానం తీర్పును స్వాగ‌తిస్తాను'' అంటూ వీడియోలో తెలిపారు.