వైభవ్ క్రేజీ ప్రాజెక్ట్ 'మెయాదా మాన్' తెలుగులో భారీగా విడుదలకు సన్నహాలు

  • IndiaGlitz, [Friday,August 11 2017]

సరోజ, యాక్షన్ త్రీడీ, అనామిక లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు వైభవ్. ఈ హీరో తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో అనువాదం అవుతుంటుంది. ఈ క్రమంలో వైభవ్ నటించిన మేయాధమాన్ టాలీవుడ్ లోకి రాబోతోంది. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంతో నాయికగా పరిచయమవుతోంది. దర్శకుడు రత్నకుమార్ రొమాంటిక్ కామెడీ కథతో మేయాధమాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను పిజ్జా, జిగర్తాండ లాంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించడం విశేషం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే నెలలో మేయాధమాన్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగు తెరపైకి గ్రాండ్ గా తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ... స్టోన్ బెంచ్ సంస్థను మూడేళ్ల కిందట ప్రారంభించాం. మా సంస్థ ద్వారా ఎన్నో లఘు చిత్రాలను విడుదల చేశాం. కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్ర రంగంలోకి అడుగు పెట్టాం. మంచి కథల కోసం చూస్తున్నప్పుడు రత్నకుమార్ మేయాధమాన్ కథ చెప్పారు. కథలో ఉన్న హాస్యం, రొమాంటిక్ అంశాలు ఆకట్టుకున్నాయి. ఉత్తర మద్రాసు ప్రాంతంలో నివసించే ఓ జంట మధ్య జరిగే కథ ఇది. యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. వైభవ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు నేటి యువత ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. వచ్చే నెలలో తమిళనాట సినిమాను విడుదల చేస్తాం. తెలుగులోనూ మంచి పంపిణీదారుల కోసం చూస్తున్నాము. అన్నారు.