నా గర్ల్ ఫ్రెండ్ మరో వ్యక్తితో.. ఆసక్తి రేపుతున్న 'వద్దురా సోదరా' మోషన్ పోస్టర్!
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ యంగ్ హీరో రిషి ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. రిషి నటించిన లేటెస్ట్ మూవీ 'వద్దురా సోదరా'. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ఉంది. సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా మోషన్ పోస్టర్ లోనే కథా నేపథ్యం గురించి లైట్ టచ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: మహేష్ తర్వాత సూర్యతో.. స్క్రిప్ట్ రెడీ ?
'నా గర్ల్ ఫ్రెండ్ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తాను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను అని చెప్పింది. సో అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండడం మానేశాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బతుకుతున్నాను. నేను ఇప్పుడు సంతోషంగా బాధని అనుభవిస్తున్నా' అని మోషన్ పోస్టర్ లో వాయిస్ ఓవర్ తో వినిపిస్తున్న ఈ డైలాగులు చాలా బావున్నాయి.
బ్యాగ్రౌండ్ సంగీతం అయితే టాప్ నాచ్ గా ఉందని చెప్పొచ్చు. జీవితంలో ఇష్టంలేని పనులు చేసి కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎలాంటి వేదన మిగులుతుంది అనే పాయింట్ తో బహుశా ఈ చిత్రం తెరకెక్కుతుందేమో. రిషికి జోడిగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది.
ఈ చిత్రానికి ఇస్లాహుద్దీన్ దర్శకుడు. ప్రసన్న శివరామన్ సంగీత దర్శకుడు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com