వాసివాడి తస్సాదియ్యా... తండ్రీ కొడుకులతో చిట్టి, ఆ సొగసుకు దండాలయ్యా
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు. ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేయనున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘‘లడ్డుండా’’ , ‘‘నా కోసం’’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ‘‘వాసివాడి తస్సాదియ్య’’ అనే మాస్ మసాలా పాటను విడుదల చేశారు. తండ్రీకొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేస్తుండగా.. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఇద్దరితో కలిసి ఆడిపాడారు. 'ఓయ్... బంగ్గారాజు! నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు? అంటూ సాగే ఈ పాటను మోహనా భోగరాజు, సాహితీ చాగంటి, హర్షవర్ధన్ చావలి అలపించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్వయంగా రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com