'వామ్మో బామ్మ' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ్ ఆనంద్ దర్శకత్వం లో సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య రెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'వామ్మో బామ్మ'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలు ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేసారు.
ప్రముఖ నిర్మాతలు సాయి వెంకట్ మరియు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఈ సినిమా లోని పాటలు మరియు ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ చిత్రం యొక్క ఆడియో కీ (KEE) మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు. 'వామ్మో బామ్మ' ఒక కామెడీ హారర్ ఎంటర్టైనర్. సీనియర్ నటీమణి శ్రీలక్ష్మి గారు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ "సీనియర్ నటులు శ్రీలక్ష్మి గారు ఈ సినిమా లో నటించటం మాకు ఒక్క గొప్ప వరం. సినిమా లో తానే హీరో. ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. అనుకున్నదానికంటే సినిమా చాల బాగా వచ్చింది. మా నిర్మాతలు సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాము" అని అన్నారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ "ఈ సినిమాకి శ్రీలక్ష్మి గారే హీరో. బామ్మ గా అద్భుతంగా నటించారు. సినిమా నేను చూసాను. చాల బాగుంది సినిమా. సంగీత దర్శకుడు ఆదిత్య అందించిన పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు విజయ్ ఆనంద్ చాల బాగా తీశారు. చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం కానీ ఈ సినిమా కి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఈ సినిమా మంచి విజయం కావాలి " అని కోరుకున్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ"దర్శకుడు విజయ్ ఆనంద్ నా సినిమాలకి రైటర్ గా పనిచేసాడు. ఈ సినిమా ఆడియో కీ (KEE) మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. నా సినిమా ఐస్ క్రీం కూడా ఆ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది. హీరో కిరణ్ మంచి మిత్రుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు. శ్రీలక్ష్మి గారు ఈ చిత్రానికి ఒక్క హైలైట్ గా నిలుస్తారు. గతం లో బామ్మ మాట బంగారు బాట మంచి విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమా 'వామ్మో బామ్మ' అంతటి విజయం సాదించాలి" అని కోరుకున్నారు.
సీనియర్ నటులు శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ "ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. డైరెక్టర్ చాలా కస్టపడి చేసారు. వన్ మాన్ ఆర్మీ గా తానే అంత చూసుకున్నాడు. మంచి చిత్రం కుటుంబ సభ్యలు అందరు కలిసి చూడదగ్గ చిత్రం. ఈ సినిమా విజయవంతం కావాలి" అని కోరుకున్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ "ఈరోజుల్లో చిన్న సినిమా కష్టాలు అందరికి తెలుసు. అవకాశం దొరకటమే చాలా కష్టం. ఇప్పుడు మా సినిమా 'వామ్మో బామ్మ' త్వరలో విడుదల అవుతుంది. చాలా సంతోషం గా ఉంది. శ్రీలక్ష్మి గారితో నటించటం నా అదృష్టం. సినిమా మంచి విజయం సాదించాలి" అని తెలిపారు.
హీరోయిన్ ఆశ్లేష మాట్లాడుతూ "నాకు చాలా సంతోషం గా ఉంది సినిమా రిలీజ్ అవుతుంది అని. నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. సినిమా చాలా కస్టపడి చేసాం. మీఅందరికి నచుతుంది అని అనుకుంటున్నాను" అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com