సైకాలజికల్ థ్రిల్లర్ గా 'వాడు వీడు..ఓ కల్పన'
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ సారి ఓ యూత్ ఫుల్ కాంటెంప్రరీ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొండ్రెడ్డి సతీష్ చౌదరి నిర్మాతగా, మహంతి పీకే దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'వాడు వీడు.. ఓ కల్పన'.
19 ఏళ్లుగా సినీ పరిశ్రమలో పలువురు సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్, కోడైరెక్టర్‌గా పని చేసిన అనుభవంతో తాజాగా 'వాడు వీడు.. ఓ కల్పన' చిత్రంతో మహంతి పీకే దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సోషల్ యూత్‌ఫుల్ కమిటీమెంట్‌కి కమర్షియల్ హంగులు జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులకు లవ్.. సెంటిమెంట్.. కామెడీ.. ఫ్యామిలీ.. థ్రిల్లర్.. ఇవే కాకుండా ప్రేక్షకుడు ఊహించని మరో ఫీలింగ్ ను తమ సినిమాలో చూపించబోతున్నామని డైరెక్టర్ మహంతి పీకే, నిర్మాత కొండ్రెడ్డి సతీష్ చౌదరి తెలిపారు.
విష్ణురెడ్డి, వర్ధన్‌రెడ్డి, ఐరా, ప్రియా ప్రధాన పాత్రలుగా కృష్ణభగవాన్, ధన్‌రాజ్, కొండవలస, సనా, గీతాసింగ్, కత్తి మహేష్, మారుతి, అల్లరి సుభాషిణి, రాధాకృష్ణ, జబర్ధస్త్ సతీష్, రమణి.. తదితరులు నటించిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుకల ఈ నెల 10న ప్రసాద్ ల్యాబ్‌లో సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరగనుంది.
అన్నిహంగులు జోడించుకుని ముస్తాబవుతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో పాటు, ఓవర్సీస్ అంతటా భారీగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత కొండ్రెడ్డి సతీష్ చౌదరి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com