వి వై కంబైన్స్ బ్యానర్ లోగో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ సత్యన్నారాయణ బొక్క సమర్పణ సంస్థ లో వస్తున్న వి. వై బ్యానర్ మరియు లోగో ను దాసరి నారాయణ రావు గారి అబ్బాయి, నటుడు అరుణ్ కుమార్ చే విడుదల చేయించారు నిర్మాణ అధ్యక్షులు.
ఈ సంధర్బంగా బ్యానర్ సమర్పకుడు శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ.. "వి. వై కంబైన్స్ బ్యానర్ ను విడుదల చేయడం చాలా సంతోషం గా ఉంది, కేవలం ఒక సినిమా చేయడానికో ఈ బ్యానర్ ను నిర్మించలేదు, ఓ ప్రముఖ బ్యానర్ లా మా వి వై. కంబైన్స్ నుంచి చాలా సినిమాలు నిర్మించి ప్రముఖ గుర్తింపు పొందే విధంగా ఉండాలనే ఫ్యాషనేట్ తో వరుస సినిమాలు చేయాలని ముందుకు వచ్చాం.. అలా అని ఏ సినిమాలు పడితే అవి కాకుండా చిన్న పిల్లల దగ్గరనుంచి తాత ల దగ్గరవరకు ఫ్యామిలీ మొత్తం చూడగలిగే బంధాలు అనుబంధాలకు అర్థం చెప్పే సినిమాలే చేయాలనే ఉద్దేశ్యం తోనే సినీ పరిశ్రమ కు రావడం జరిగిందని, మంచి స్క్రిప్ట్ అందించమని మాత్రమే దర్శకుడు శ్రీ బానుచందర్ చౌదరి ను కోరాను" అన్నారు. అనంతరం
దర్శకుడు బానుచందర్ చౌదరి మాట్లాడుతూ.. "అభిరుచి ఉన్న నిర్మాతలు సినీ పరిశ్రమకు రావడం చాలా అవసరం, వి. వై కంబైన్స్ బ్యానర్ అధినేత శ్రీ సత్యనారాయణ నటీనటులు ఎవరని అడగలేదు నన్ను మంచి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని మాత్రమే అడిగారు, దాదాపు 8 నెలలు స్క్రిప్ట్ వర్కే చేయడానికి అవకాశం ఇచ్చారు. "అర్ధనారి" చిత్రం తరువాత ఇలాంటి ఫ్యాషనేట్ తో ఉన్న నిర్మాణం లో నా తదుపరి చిత్రం ఉండటం చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో మా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఉంటుంది, ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తర్వలో ప్రకటిస్తామం" అన్నారు.
దాసరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. "ఇంత మంచి బ్యానర్ ను నా చేత లాంచ్ చేయించినదుకు ఆనందిస్తున్నా, ఈ బ్యానర్ లో నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుల మెప్పు పొంది విజయాలు సాధించాలని కోరుకుంటున్నా, నిర్మాతలకు దర్శకులకు మంచి పేరు కూడా వచ్చి గొప్ప నిర్మాణ సంస్థగా పెరగడించాలని మనస్ఫూర్తిగా శుభాభినదనలను తెలియచేస్తున్నా" అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత హితేష్ బొక్క, భాను తదితరులు పాల్గొని వారి అభినందనలు అభిప్రాయాలను తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com