శివ 143 ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వి.వి.వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవ రం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం శివ 143.. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ... రామ సత్యనారాయణ.. నాకు చిరకాల మిత్రుడు..చిన్న సినిమాల నిర్మాణం లో అందెవేసిన చెయ్యి.. చిన్న సినిమా ఎలా తీయలో తీసిన సినిమాను ప్రేక్షకులలో కి ఎలా తీసుకువెళ్లలో బాగా తెలిసిన వాడు... దర్శకుడు సాగర్ శైలేష్ హీరో గా దర్శకుడు గా.కొరియోగ్రాఫర్. గా బాగా చేసాడు ట్రైలర్ బాగుందీ..DS రావు విలన్ పాత్రలో బాగా సూటు అయ్యాడు. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుక గా వస్తుంది అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... నేను ఏ పని చేసినా డైరెక్టర్ వినాయక్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన గతంలో మా రహస్యం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పడు శివ143 సినిమా ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల అవ్వడం విశేషం. డైరెక్టర్, హీరో శైలేష్ ఈ సినిమాను అందంగా తెరకెక్కించారు. గతంలో మా భీమవరం టాకీస్ బ్యానర్ లో వచ్చిన రహస్యం తరహాలోనే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శైలేష్ హీరోగా, దర్శకుడుగా నేను నిర్మించిన రహస్యం సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ శైలేష్ నేను కలసి శివ143 సినిమాను తీశాము అన్నారు.
హీరో , డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ... రామసత్యనారాయణ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నన్ను నమ్మి ఈ ప్రాజెస్ట్ ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. మా చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ వినాయక్ గారు (సీనయ్య) విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సగం విజయం పొందినట్టే ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సంక్రాంతి కానుకగా మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరికి నచ్చే విధంగా మా సినిమా ఉండబోతోందని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com