‘సోది ఆపి.. దమ్ముంటే నన్ను ఆపు’ (‘V’ టీజర్ రివ్యూ)
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘V’ చిత్రం. ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదలింది. సోషల్ మీడియా వేదికగా సోమవారం నాడు ఈ టీజర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడు నాలోంటోడు రూల్స్ కొద్దిగా బ్రేక్ చేస్తుంటాడు అంతే’ అనే అదిరిపోయే సుధీర్ బాబు ఫైట్ సీన్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది.
నాని డైలాగ్స్!
‘యూ ఆర్ సైకో.. యూ నో దట్‘ అని నివేదా ధామస్ అనగా.. ‘అమ్మో, నిజమా’ అంటూ నాని డైలాగ్ చెబుతాడు. ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి నువ్వొస్తున్నావ్ అనగానే.. నేనేమీ నీ ఫ్యాన్ ని కాదురా’..అని డైలాగ్ పేల్చగా.. సుధీర్ కాల్ చేసి ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా అని అనగా.. ‘సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు’ అని అదిరిపోయ్ డైలాగ్‌తో నాని ఒకింత వార్నింగ్ ఇచ్చాడు.
టీజర్ రివ్యూ..!
కాగా.. 01:02 నిడివి గల ఈ టీజర్‌లో సినిమా రేంజ్ ఏంటో.. సినిమా ఎలా ఉండబోతోందే డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి చాలా స్పష్టంగా చూపించాడని చెప్పుకోవచ్చు. పక్కా మాస్ చిత్రం లాగా ఉంది. ఇందులో నాని హీరోగా.. సుధీర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని తెలిసిపోయింది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు.. అదిరిపోయే పాత్రలో చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు పోలీస్ ఆఫీసర్ అయిన సుధీర్ హైలైట్‌గా నిలుస్తాడని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. నాని ఏదో కేసులో ఇరుక్కోవడం.. ఆయన్ను పట్టుకోవడానికి సుధీర్ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉండటం.. నాని మాత్రం వారికి చిక్కకుండా వారితో ఓ ఆట ఆడుకోవడం.. వార్నింగ్స్ ఇస్తుండటంను బట్టి చూస్తే సినిమాపై అంచనాలు బాగానే పెరిగిపోయాయి. ఫైట్ సీన్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తున్నాయి. ఉగాది కానుకగా మార్చి 25న ‘వి’ వచ్చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments