'వి' మార్చి 25న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `వి`. ``ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు`` ట్యాగ్ లైన్. హీరో నాని 25వ చిత్రమిది.నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్,లక్ష్మణ్,హర్షిత్ నిర్మాతలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేస్తున్నారు
ఈ సందర్భంగా ...
నిర్మాతలు శిరీష్,లక్ష్మణ్,హర్షిత్ మాట్లాడుతూ `` నాని 25వ చిత్రం మా బ్యానర్లో రూపొందుతుండటం ఆనందంగా ఉంది. అలాగే సుధీర్‌బాబుగారు, నివేదా థామస్, అదితిరావుగారి కాంబినేష్ కుదిరింది. ఈ చిత్రంలో నాని మరియు సుధీర్ బాబు పోటా పోటీగా నటించారు. మోహనకృష్ణగారు సమ్మోహనం వంటి సూపర్‌హిట్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు నానిగారు చూడని ఓ కొత్త పాత్రలో కనపడతారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చేలా ఉంటుంది. ఉగాది సందర్భంగా సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com