ఈ సినిమా థియేటర్లో చూస్తే చాలా బాగుంటుందన్నారు: ‘వి’ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’. ఇప్పటి వరకు థియేటర్స్ కోసమే ఎదురు చూసిన ఈ చిత్రం.. పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘‘పద్మావత్’ వంటి సినిమాలను చేసిన బిశ్వదీప్ చటర్జీ సౌండ్ డిజైనర్ ఈ సినిమాకు పని చేశారు. ఈ సినిమాను థియేటర్లో చూస్తే చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. ఈ సినిమా విడుదల కోసం చాలా కాలం వెయిట్ చేశాం. కానీ ఇంకా ఆగటం సమంజసం కాదనిపించింది. అందుకే దిల్ రాజు గారితో చర్చించి దీనిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాం. దిల్ రాజు గారు కూడా దీనిని ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిర్ణయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాను ఫ్యూచర్లో థియేటర్లో రిలీజ్ చేయాలా? వద్దా అనే విషయంపై మాత్రం చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com