‘సైరా’కు షాక్.. చిరు ఆఫీస్ ముందు ఆందోళన!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన చరిత్రాత్మక చిత్రం ‘సైరా’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో నిమగ్నమైంది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్-02న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కాగా ప్రమోషన్స్ మొదలెట్టిన చిత్రబృందం.. త్వరలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా జరపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
సరిగ్గా.. ఇదే టైమ్‌లో ‘సైరా’కు ఊహించని షాక్ తగిలింది. తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వంశీయులు పోరాటానికి దిగారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కార్యాలయం ముందు సైరా వంశీయులు ఆందోళన నిర్వహించారు. ‘సైరా’ సినిమా తీసేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు.. సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్లతో పాటు, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా తమ నుంచి తెలుసుకొన్నారని వారు చెబుతున్నారు. అయితే కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్‌ను పూర్తి చేసుకొని.. ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వారు చెబుతున్నారు.
కాగా.. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి స్థానికంగా ఉన్న పీఎస్‌కు తరలించారు. అయితే చిరు వారికి ఏమిస్తామని మాటిచ్చారు..? ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు..? మరి ఇదే ఆందోళన కొనసాగిస్తే మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుంది..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments