చిరంజీవి అబద్ధం చెబుతున్నారు..కేసులు ఉపసంహరణ: ఉయ్యాలవాడ వంశీకులు
Send us your feedback to audioarticles@vaarta.com
తాము ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయాలు అడిగామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. ఇటీవల ఇంటర్వ్యూలో చిరంజీవి అలా చెప్పడం అబద్ధం అంటూ ఉయ్యాలవాడ వంశీకులు తెలిపారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అక్టోబర్ 2న సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు దగ్గర పడే సమయంలో ఉయ్యాలవాడ కుటుంబీకులు సినిమా విడుదలకు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సినిమాను తెరకెక్కించే సమయంలో తమకు చిరంజీవి, చరణ్ ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని వారు ఆందోళనలు చేశారు, అరెస్ట్లయ్యారు. ఈ వివాదం పలు మలుపులు తిరిగింది.
అయితే రీసెంట్గా ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉయ్యాలవాడ కుటుంబీకులు తమకు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయలివ్వాలన్నారని తెలిపారు. అయితే దీనిపై ఉయ్యాలవాడ కుటుంబీకులు స్పందించారు. చరణ్ చెప్పినట్లు తామ ఒక్కొక్క ఫ్యామిలీ రూ. 15లక్షలు అడిగామే తప్ప తాము ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు అడగలేదని, చిరంజీవి అబద్ధం చెప్పారని వారు తెలిపారు. అంతే కాకుండా `సైరా నరసింహారెడ్డి`పై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నామని కూడా తెలిపారు.
దాదాపు 300 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ భారీ చిత్రంలో చిరంజీవితోపాటు అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, తమన్నా, అనుష్క, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout