కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ పేరు: జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఒకప్పుడు మారుమోగిన ఈ పేరు.. ఆ తరువాతి కాలంలో ఈ పేరు మరుగున పడిపోయింది. ఇటీవల కొన్ని తరాలకైతే ఈ పేరు అసలు తెలియదన్నా ఆశ్చర్యం కాదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ముందుగా ఆయనెవరు? అనే టాక్ మొదలైంది. ఆ తరువాత సినిమా విడుదలయ్యే లోపు జనాలు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అని తెలుసుకున్నారు. దీంతో మరోసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.. ఆయన గొప్పతనం.. తెలుగు వారికి బాగా తెలిసొచ్చింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని ఒకరకంగా మెగాస్టార్ తెలుగు రాష్ట్రాలకు చాటి చెబితే.. ఏపీ సీఎం జగన్ దానిని పదిలం చేశారు. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘‘1857 సిపాయి తిరుగుబాటు కన్నా ముందు 1847లోనే పరాయిపాలకులపై రైతుల పక్షాన పోరాటం చేసిన ఉయ్యాలవాడ కర్నూలు గడ్డ పైనే జన్మించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెడుతున్నాం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అన్నారు.
ఇంకా జగన్ మాట్లాడుతూ.. ‘‘గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది. ఇక నుండి విమాన ప్రయాణం కూడా జరగబోతోంది. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయం. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రిబ్బన్ కట్ చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశాం. 110 కోట్ల ఖర్చుతో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని ప్రారంభించాం. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను తీసుకొచ్చాo. ఏటీసీ, డీజీసీఏ అనుమతులు తెప్పించేందుకు అధికారులు విశేష కృషి చేశారు’’ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout