'పిట్టగోడ' రిలీజ్ కి రెడీ

  • IndiaGlitz, [Monday,November 28 2016]

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా...ఇలా సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్ బ్యాన‌ర్స్ పై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత రామ్మోహన్‌ పి. మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా తర్వాత మా బేనర్‌లో వస్తోన్న మరో విభిన్న చిత్రం 'పిట్టగోడ'. ఈ చిత్రం ద్వారా విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, అనుదీప్‌ కె.వి. దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి, టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అయింది. 'పిట్టగోడ' మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి.

More News

సంఘం నుంచి తొలిగించిన విశాల్ పై శ‌ర‌త్ కుమార్ రియాక్ష‌న్..!

త‌మిళ‌నాడులో న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏర్ప‌డిన గొడ‌వ‌లు...ఎన్నిక‌ల త‌ర్వాత స‌ర్ధుకుంటాయి అనుకుంటే రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ...త‌గ్గ‌డం లేదు. తాజాగా న‌డిగ‌ర సంఘం జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసింది.

ప్రముఖ దర్శకుడు బాల సమర్పణ లో 'కాళి'

ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన `చండివీరన్` తెలుగులో `కాళి` అనే పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు.

'రెమో' చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు తెలుగులో విడుదల చేసిన చిత్రం `రెమో`. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్ననన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

వెంకటేష్ గురు షూటింగ్ పూర్తి..!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అదేమిటో చెబితే అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే - త‌మ‌న్నా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సంవ‌త్స‌రం ఊపిరి, అభినేత్రి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్పెష‌ల్ సాంగ్ లో కూడా కనిపించి క‌నువిందు చేసింది. ఇదిలా ఉంటే...ఈ సంవ‌త్స‌రం బాగానే గ‌డిచింది. ఇక వ‌చ్చే సంవ‌త్స‌రం చేసే సినిమాలు చెబితే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు అంటుంది మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.