చపాతీ ముక్క కోసం ‘ఉయ్యాల జంపాల’ భామ రచ్చ!
- IndiaGlitz, [Friday,July 26 2019]
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌లో ఐదో రోజు చపాతి ముక్క కోసం రచ్చరచ్చే జరిగింది. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్‌లో 6 కంటెస్టెంట్స్ ఉండటంతో రంజుగా మొదలైంది. షో ప్రారంభవ్వగానే సీనియర్ హేమ- పాపులర్ సింగర్ రాహుల్ సిప్లింగంజ్‌ల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించినప్పటికీ ఒకరికొకరు ఏ మాత్రం తగ్గలేదు. అయితే రేపు నాగార్జున వస్తారుగా అప్పుడే తేల్చుకుందాం అని హేమ అనడంతో.. పక్కనే ఉన్న మహేష్ విట్టా కల్పించుకుని ఆయన లెవల్ ఏంటి? మన ఈ పత్తి యాపారం ఏంటి? అని అదిరిపోయే టైమింగ్ పంచ్‌తో అదగరగొట్టాడు. దీంతో హేమ నోరెళ్లబెట్టినంత పనైంది.
అసలేం జరిగింది..!?
హేమ వర్సెస్ రాహుల్‌ల వివాదం కొలిక్కి రాకమునుపే.. ‘నా చపాతి ముక్క సగం తినేశారు’ అంటూ ‘ఉయ్యాల జంపాల’ భామ పునర్నవి భూపాలం సిల్లీ చర్చకు తెరతీసింది. ‘నా చపాతీని ముక్కను అలీ రజా సగం తినేశారు.. ఇంత సిల్లీగా వ్యవహరిస్తారేంటి?’ అంటూ రచ్చ చేసింది. దీంతో నిజమేనా అలీ రాజాని చపాతీ తినేశావా? అని అడగడం.. ఆఫ్ట్రల్ చపాతీ ముక్కకోసం ఇంత రచ్చా అని షో చూస్తున్న బిగ్‌బాస్ ప్రియులు, ప్రేక్షకులు కాసింత విసుక్కున్నారు.
దొంగెవరో తెలిసింది!
మరోవైపు.. ఈ రచ్చలో కూడా కలుగజేసుకున్న బిగ్‌బాస్ శివగామి హేమ వచ్చి.. ‘నువ్వే చపాతీ తినేశావని వాళ్లు అనుకుంటున్నారు నిజమేనా’.. అంటూ అలీ రాజా చెవిన వేసింది. ఇందుకు ఆయన రియాక్ట్ అవుతూ..‘నేను ఎక్కడ తిన్నా.. తిన్నది నేను కాదు. బాబా భాస్కర్’ అని నిజం చెప్పేశాడు. ఇందుకు బాబా భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఎస్ నేనే కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నాను’ అని తనదైన కామెడీగా చెప్పాడు. ఫైనల్‌గా పునర్నవీ స్పందిస్తూ.. అయ్యో మీరు తిన్నారా? అనవసరంగా నేను అలీని అనేశానే’ అని నాలుక కర్చుకుని మిగిలిన చపాతీ ముక్కను ఎంచక్కా లాగించేసింది. మొత్తమ్మీద దొంగెవరో తెలియడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.
కాగా.. అంతకుముందు బిగ్‌బాస్ హౌస్‌లో బాహుబలి స్పూప్‌ను చేశారు. ఆ తర్వాత ఈ వారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘చాయిస్ యువర్స్’ అంటూ హేమ, జాఫర్‌లను టాస్క్ కోసం ఎంపిక చేసుకున్నారు కంటెస్టెంట్స్. ఈ ఇద్దరు గేమ్‌లో సక్సెస్ కావడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ సాధించారు. ఆ తర్వాత టీవీ రిమోట్ మహేష్ కోసం రచ్చ జరగడం.. వరుణ్ వర్సెస్ మహేశ్‌ల మధ్య గొడవ జరగడం ఇదంతా ఐదో ఎపిసోడ్‌లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ అక్కడక్కడా ఓవారక్షన్ కూడా ఉంది.