యువిక్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా 'హ్యాపీవెడ్డింగ్'
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలు సాధిస్తున్న యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా 'హ్యపీ వెడ్డింగ్'. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహరిక మెట్టమెదటి సారి సుమంత్ అశ్విన్ తో చేయటం విశేషం. అలాగే రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మెట్టమెదటి సారిగా సుమంత్ అశ్విన్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపోందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని అక్టోబర్ 4 నుండి ప్రారంభిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో క్రేజి బ్యానర్ యు వి క్రియోషన్స్ బ్యానర్ తో మేము అసోసియోట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్, నిహారిక లు జంటగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. టొటల్ గా ఈ కాంబినేషన్ లో మెట్టమెదటిసారిగా తెరకెక్కిస్తున్నాము. అక్టోబర్ 4 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కి వెలుతుంది. రోమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.. అని అన్నారు..
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహరిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, నిరోష తదితరులు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com