కేటీఆర్ ఓ బచ్చా.. విర్రవీగుతున్నాడు..!
- IndiaGlitz, [Thursday,September 26 2019]
తెలంగాణలోని హుజుర్నగర్లో జరగనున్న ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తంటాలు తెచ్చిపెట్టింది. తమ పార్టీ అభ్యర్థినే గెలించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా తమ అభ్యర్థిని గెలిపించుకుని చరిత్ర తిరగరాస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ ఓ బచ్చా.. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది’ అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
చరిత్రను మలుపుతిప్పే ఎన్నిక!
‘అయ్య కేసీఆర్ ఇచ్చిన పదవితో కేటీఆర్ విర్రవీగుతున్నారు. హూజూర్ నగర్ లో ఏం చేశారో కేటీఆర్ చెప్పాలి. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపని చెప్పుకుంటున్న కేటీఆర్... కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారో కూడా చెప్పాలి. హుజూర్ నగర్ ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పే ఎన్నిక. టీఆర్ఎస్లో చేరాలంటూ కాంగ్రెస్ నేతలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై గుత్తా మీద గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేస్తాం. డబ్బు, మద్యం, అధికారంతో టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోంది’ అని కేసీఆర్ సర్కార్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన.. కేంద్ర బలగాలతో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు.