Ustaad Bhagat Singh:'గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం'.. అదిరిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్లేజ్..
- IndiaGlitz, [Tuesday,March 19 2024]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి పవర్‌ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. 'భగత్స్ బ్లేజ్' అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ను హైలెట్ చేశారు. ఇక ఈ టీజర్‌లో పవన్ లుక్స్, స్వాగ్, డైలాగ్స్ అదిరిపోయాయి.
ముఖ్యంగా విలన్ ‘గాజు గ్లాసు చూపిస్తూ ‘నీ రేంజ్ ఇదీ’ అంటూ దాన్ని పగులకొడతాడు. దీనికి సమాధానంగా గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది అని పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తంగా చూస్తే అభిమానులకు మాత్రం ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక బీజీఎం, కెమెరా వర్క్ అన్నీ కూడా అదిరిపోయాయి.
అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో టీజర్‌తో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌ను హైలెట్ చేశారు. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టేలా డైలాగ్‌లు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బాస్టర్ ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు్న్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నేను ఈ సినిమా షూట్ చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ ఐదు రోజులు ఫుటేజ్‌నే టీజర్‌గా కట్ చేశాము. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సెట్స్‌లో ఏ వైబ్ అయితే కనిపించేదో.. ఇప్పుడు ఉస్తాద్ మూవీ సెట్స్‌లో కూడా అదే వైబ్ మాకు కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో నేను సినిమాతోనే చూపిస్తాను అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం ఐదు రోజుల షూట్‌తోనే మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ ఇవ్వడం హరీష్‌ను అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే గతేడాది మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ నటించాడు. ఈ మూవీలన్ని వచ్చే ఏడాది లోపు విడుదల కానున్నాయి.