ఈ ల్యాబ్‌ను కరోనా టెస్ట్‌లకు వాడుకోండి..: మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్ర, యూపీ, కేరళ, ఢిల్లీ, తెలంగాణతో పాటు ఏపీ, బెంగాల్ సీఎంలతోనూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను నివారించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారనే దానిపై నిశితంగా చర్చించారు. ఎండలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని భావించవద్దని.. ఎండలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాలోనూ వైరస్ విజృంభిస్తోందని అనే విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
ఈ ల్యాబ్‌ను వాడుకోండి!
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. మోదీకి పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్‌లోని ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్ఐఆర్) కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్‌గా వినియోగించుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆ ల్యాబ్‌కు ఉన్న ప్రత్యేకతలను కూడా కేసీఆర్ నిశితంగా వివరించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తే తెలంగాణలోని వారివే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడి వారివైనా ఒకే సారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే అవకాశం ఉంటుందని మోదీ దృష్టికి కేసీఆర్ తెచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించడమే కాకుండా.. పలు సూచనలు కూడా చేశారు.
సీఎస్ఐఆర్ గురించి..
పరిశోధనల పరంగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 79 ఏళ్లు పూర్తి అయ్యింది. కేంద్రం పరిధిలో పరిశోధనలు సాగిస్తున్న ‘సీసీఎంబీ’ మానవాళి మనుగడ కోసం ఎన్నో విజయాలు సాధించింది. ప్రకృతిలో లభించే సహజ సంపదను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు 1942 దశకంలో ఆనాటి ప్రభుత్వం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1981-82 సంవత్సరంలో సీసీఎంబీకి జాతీయస్థాయి ల్యాబ్రేటరీగా గుర్తింపు నిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com