ఉసేన్ బోల్ట్ కు కవల పిల్లలు.. ఇద్దరి పేర్లు మాత్రం పిచ్చ క్రేజీ, నెట్ లో వైరల్!
Send us your feedback to audioarticles@vaarta.com
జమైకన్ స్ప్రింటర్, పరుగుల రారాజు ఉసేన్ బోల్డ్ కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. బోల్డ్ అతడి భాగస్వామి కాసి బెన్నెట్ కు కవల పిల్లలు జన్మించారు. ఈ శుభవార్తని బోల్ట్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రకటించాడు. 2020లో ఈ జంటకు పాప జన్మించింది. వారి కుమార్తె పేరు ఒలంపియా లైట్నింగ్ బోల్ట్. తాజాగా ఈ జంటకు మగ కవల పిల్లలు జన్మించారు.
వీరిద్దరూ ఎప్పుడు జన్మించారు అనే విషయాన్ని బోల్ట్ ప్రకటించలేదు. అయితే ఇద్దరి పేర్లని మాత్రం ప్రకటించారు. బోల్ట్ కుమారుల ఇద్దరి పేర్లు క్రేజీగా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బోల్ట్ పిల్లల పేర్లే వైరల్ అవుతున్నాయి. తన కవల కుమారులిద్దరికీ సెయింట్ లియో బోల్ట్, థండర్ బోల్ట్ అని పేర్లు పెట్టాడు.
ఉసేన్ బోల్ట్, కాసి బెన్నెట్ ఇద్దరూ జంటగా తమ పిల్లలతో దిగిన ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి. బోల్ట్ జంట చిరునవ్వులు చిందిస్తుండగా వారి పిల్లలు చూడ ముచ్చటగా ఉన్నారు. బోల్ట్, బెన్నెట్ చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు.
34 ఏళ్ల బోల్ట్ ఒలంపిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2008, 2012, 2016 ఒలంపిక్స్ లో బోల్ట్ బంగారు పతకాలు సాధించాడు. 100 మీటర్లు, 200 మీట్లర్ల రన్నింగ్ లో బోల్ట్ ఒక చరిత్ర. వరుసగా మూడు సార్లు ఈ ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్స్ పొందిన ఘనత బోల్ట్ కే సొంతం. 2019లో బోల్ట్ తన రిటైర్ మెంట్ ప్రకటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com