చైనాపై పోరులో భారత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!

  • IndiaGlitz, [Friday,June 26 2020]

చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. లైన్ ఆప్ కంట్రోల్ వద్ద దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. కాగా అమెరికాకు చెందిన సైన్యం జర్మనీలో 30 వేల మంది దాకా ఉన్నారు. వారిలో 9500 మందిని వెనక్కి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది.

భారత్‌కు అవసరమైతే ఆ 9500 మందిని పంపించేందుకు సిద్ధమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. చైనా సైనిక చర్యలు భారత్‌తో పాటు మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్ ఇండోనేషియా దేశాలకు ముప్పుగా పరిగణించాయని పాంపియో పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు తమ బలగాలతో పాటు అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తామని పాంపియో తెలిపారు.

కాగా.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భారత సరిహద్దుల్లో చైనా బలగాలు చొరబాటుకు దిగుతున్నాయని అత్యున్నత స్థాయి అమెరికన్ సెనేటర్ ఒకరు పేర్కొన్నారు. వారిని ఎదిరిస్తూ 20 మంది భారత సైనికులు చనిపోయారన్నారు. చైనా సైనికులు బేస్‌బాల్ బ్యాట్లకు మేకులు కొట్టి మరీ దాడి చేశారని సెనేట్ సాయుధ సేవల కమిటీ చైర్మన్ జిమ్ ఇన్హోఫ్ పేర్కొన్నారు.

More News

ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడిపేందుకు యత్నించి కింద పడిపోయిన ‘జెర్సీ’ హీరోయిన్

‘జెర్సీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ అమ్మడు 2017లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకుంది.

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు.

తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి.