చైనాపై పోరులో భారత్కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. లైన్ ఆప్ కంట్రోల్ వద్ద దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. కాగా అమెరికాకు చెందిన సైన్యం జర్మనీలో 30 వేల మంది దాకా ఉన్నారు. వారిలో 9500 మందిని వెనక్కి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది.
భారత్కు అవసరమైతే ఆ 9500 మందిని పంపించేందుకు సిద్ధమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. చైనా సైనిక చర్యలు భారత్తో పాటు మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్ ఇండోనేషియా దేశాలకు ముప్పుగా పరిగణించాయని పాంపియో పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు తమ బలగాలతో పాటు అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తామని పాంపియో తెలిపారు.
కాగా.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భారత సరిహద్దుల్లో చైనా బలగాలు చొరబాటుకు దిగుతున్నాయని అత్యున్నత స్థాయి అమెరికన్ సెనేటర్ ఒకరు పేర్కొన్నారు. వారిని ఎదిరిస్తూ 20 మంది భారత సైనికులు చనిపోయారన్నారు. చైనా సైనికులు బేస్బాల్ బ్యాట్లకు మేకులు కొట్టి మరీ దాడి చేశారని సెనేట్ సాయుధ సేవల కమిటీ చైర్మన్ జిమ్ ఇన్హోఫ్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments