అమెరికా అధ్యక్ష పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
- IndiaGlitz, [Saturday,November 07 2020]
అమెరికా అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే విజయానికి జో బైడెన్ మాత్రం మరింత చేరువయ్యారు. నెవెడా, పెన్సిల్వేనియాలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. నార్త్ కరోలైనా, అలస్కాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్జియాలో రీ కౌంటింగ్‌కు నిర్వహించనున్నారు. బైడెన్, ట్రంప్ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. 0.5 శాతం మాత్రమే తేడా ఉండడంతో రీ కౌంటింగ్‌కు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బైడెన్‌కు 264, ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.
నెవెడా, పెన్సిల్వేనియా, జార్జియాలో ఎక్కడ గెలిచిన బైడెన్‌కే పీఠం దక్కనుంది. కాగా ఇప్పటి వరకూ 45 రాష్ట్రాల ఫలితాలు వెల్లడైంది. నెవెడా, జార్జియా, పెన్సిల్వేనియాలలో మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. నెవెడాలో 92 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి.. 20వేల పై చిలుకు మెజారిటీలో బైడెన్ ఉన్నారు. జార్జియాలో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో.. 99 శాతం మేర ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. జార్జియాలో ట్రంప్ కంటే బైడెన్ 1600 ఓట్లకు పైగా ముందంజలో ఉందన్నారు.