అమెరికా సాయం భారత్‌కు చేరింది: యూఎస్ ఎంబసీ
- IndiaGlitz, [Friday,April 30 2021]
ప్రస్తుతం భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ కొరతతో పాటు టెస్టింగ్ కిట్లు, పీపీఈ కొట్ల కొరత దేశాన్ని కుదిపేస్తోంది. ఈ తరుణంగా అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలవనున్నట్టు ఈ వారం మొదట్లో ప్రకటించింది. చెప్పిన ప్రకారమే.. భారత్‌కు అత్యవసర సాయాన్ని అందించింది. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇండియా తమకు అండగా నిలిచిందని.. అలాంటి ఇండియాలో ఇప్పుడు అత్యవసర పరిస్థితి నెలకొందని.. అందుకే తాము భారత్ పక్షాన నిలవాలనే ధృఢ సంకల్పాన్ని తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
అమెరికా పంపిన పరికరాలు, అత్యవసర సాయం ఇండియాకు చేరుకుందని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్ వేదికగా ఫోటోలతో సహా వెల్లడించింది. కోవిడ్‌తో పోరాడేందుకు ఎన్నో అత్యవసర పరికరాలు, ఇతర సహాయంలో అవసరమైన తొలివిడత షిప్మెంట్ భారత్‌కు చేరింది. 70 ఏళ్లకు పైగా అందించుకుంటున్న సహకారాన్ని మరింత పునరుద్ధరిస్తూ.. భారత్, అమెరికాలు కోవిడ్‌పై ఉమ్మడిగా పోరాడతాయి’’ అని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు #USIndiaDosti అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది.
అత్యవసర పరికరాలను అమెరికా నుంచి తీసుకొచ్చిన సూపర్ గెలాక్సీ విమానం నేటి ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 400 ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు 10 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఆసుపత్రుల్లో ఉపయోగించే అత్యవసర పరికరాలున్నాయి. అలాగే బ్రిటన్, రొమేనియా నుంచి కూడా 80 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లు అందాయి. యూకే నుంచి 280 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు 365 వెంటిలేటర్లను ఇండియాకు అందజేసింది.