ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొస్తాయి - US కన్సోలేట్ జనరల్ కేథరిన్ బి హడ్డా
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో జరుగుతున్న విమెన్ ట్రాఫిక్, సెక్స్ రాకెట్‌లకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ తమ వంతు బాధ్యతగా చిత్రీకరించిన యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిలిమ్స్ ని US ఎంబసి అండ్ కన్సోలేట్ జనరల్ కేథరిన్ బి హడ్డా సూపర్‌స్టార్ మహేష్ సతీమణి నమ్రత గారితో కలిసి హైదరాబాద్ ఏ ఎమ్ బి సినిమాస్‌లో వీక్షించారు. ఈ చిత్రాలను ప్రదర్శించడానికి మహేష్, నమ్రత, ఏషియన్ సినిమాస్, క్యూబ్ సంస్థలు అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ ప్రకటనలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా US కన్సోలేట్ జనరల్ కేథరిన్ బి హడ్డా మాట్లాడుతూ, "సమాజానికి అవసరమైన ఇటువంటి పవర్‌ఫుల్ యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరించిన డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు. ఈ ఎవేర్‌నెస్ ప్రోగ్రాం నడుపుతున్న ప్రతినిధులతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ అందిస్తున్న నా స్నేహితులు మహేష్, నమ్రతగారికి, ఏషియన్ సినిమాస్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ షార్ట్ ఫిల్మ్స్ ను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కలిపి దాదాపు 700 థియేటర్లలో వేలాది ప్రేక్షకులకు షోలు ప్రదర్శించే ముందు చూపించడమనేది ఒక అద్భుతమైన సంకల్పం. ఇలాంటి పవర్ఫుల్ మెసేజ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్ట్స్ కమ్యూనిటీ ముందుకు రావడం అభినందనీయం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే టాలీవుడ్ ఈ ఎవేర్‌నెస్ ప్రోగ్రాంకి తన సహకారాన్ని ఇవ్వడం గొప్ప విషయం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com