ఎమ్మెల్సీ కాబోతున్న ప్రముఖ నటి ఊర్మిళ!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి ఊర్మిళా మంతోడ్కర్ ఎమ్మెల్సీ అవనున్నారు. గత ఎన్నికల్లో చాలా యాక్టివ్గా ఉండటమే కాకుండా ముంబై నార్త్ నుంచి ఊర్మిళ కాంగ్రెస్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఊర్మిళ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమెను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని శివసేన భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పేర్కొంటున్నారు.
గవర్నర్ కోటా కింద 12 మంది నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నారు. ఈ 12 మందిలో ఊర్మిళా పేరును ఉద్ధవ్ చేర్చినట్లు సమాచారం. ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నారన్న ఊహాగానాలు తన దృష్టికి కూడా వచ్చాయన్నారు. అది రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చివరి నిర్ణయం తీసుకోవడానికి ఉద్ధవ్కే అధికారమిచ్చామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అయితే గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎవరెవర్ని నామినేట్ చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com