రెండు భాగాలుగా ‘ఉప్పెన’ ..?

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

క‌రోనా టైమ్‌లో లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ స‌డ‌లింపులు వచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌డంతో చాలా మంది త‌మ సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోవ‌లో త్వ‌ర‌లోనే ఉప్పెన చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే ఎలాగూ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నాం కాబ‌ట్టి.. సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. రెండు భాగాలకు కావాల్సినంత ఫుటేజ్ ఉంద‌ట‌. కాబ‌ట్టి రెండు భాగాలుగా విడుద‌ల చేసేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి చివ‌ర‌కు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే

వైష్ణ‌వ్ తేజ్, క్రితిశెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించారు. డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా పాట‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.