ఓటీటీలోకి ఉప్పెన.. నెట్‌ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసిందంటే..!
- IndiaGlitz, [Tuesday,February 23 2021]
‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ రికార్డులను తిరగరాస్తున్నాడు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు.. 21 సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీకి చెందిన డెబ్యూ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక్క వైష్ణవ్‌కే సాధ్యమైంది. అలాగే డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది.
అలాగే ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఇది ఈ విషయమై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ‘ఉప్పెన’పై స్టార్ హీరోలంతా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మెగా హీరోలతో పాటు నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించారు.