‘ఉప్పెన‌’ ఎడిటింగ్ పూర్తి..ర‌న్ టైమ్ లాక్డ్‌

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోద‌రుడు. ఈ యువ హీరో తొలి చిత్రంగా ‘ఉప్పెన’ తెరకెక్కింది. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగిపోయింది. సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తారంటూ వార్త‌లు కూడా విన‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు నిర్మాత‌లు సినిమాను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు.

సినిమా ఎడిటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయ‌ట‌. సినిమా వ్య‌వ‌థి రెండున్న‌ర గంట‌ల‌లోపే ఫిక్స్ చేశార‌ట‌. డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాతో క‌లిసి సుకుమార్ ఎడిటింగ్‌లో పార్ట్ కావ‌డంతో ఉప్పెన ఔట్‌పుల్ బాగా వ‌చ్చింద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే చిరంజీవి స‌హా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌ముఖుల‌కు ఈ సినిమా స్పెష‌ల్ షో వేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడ‌ని టాక్‌. ఆగ‌స్ట్‌లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే అవ‌కాశాలున్నాయని అంటున్నారు. అలా నిర్ణ‌యం జరిగితే ఉప్పెన రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ రానుంది.

More News

మీరా వ్యవహారంపై పూనమ్ షాకింగ్ ట్వీట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తాతయ్య ఉండుంటే నేనెప్పుడో హీరో..!

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు,

పేద విద్యార్థులకు జగన్ సర్కార్ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే ప్రజలు.. మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ 15 మంది త్వరలో అరెస్ట్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రామానాయుడు సేవలు చిరస్మరణీయం : చంద్రబాబు

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు,