రామ్ స‌ర‌స‌న ‘ఉప్పెన’ బ్యూటీ

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

తొలి చిత్రం ఉప్పెన‌తో శాండిల్‌వుడ్ బ్యూటీ కృతిశెట్టి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. ఉప్పెన సినిమా విడుద‌ల కాక‌ముందే ఈ అమ్మ‌డుకి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అయితే ఎప్పుడైతే సినిమా విడుద‌లైందో అప్పుడు అవ‌కాశాలు ఉప్పెన‌లా మారాయి. లేటెస్ట్‌గా మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌డానికి ఈ అమ్మ‌డు అగ్రిమెంట్‌పై సైన్ చేసింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ రీసెంట్‌గా కృతిశెట్టి ఓకే చేసిన సినిమా ఎవ‌రితోనే కాదు.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో. ఈ ఏడాది రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ ఓ ద్విభాషా చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.

రామ్‌కి ఇది తొలి తమిళ చిత్రమవుతుంది. కృతిశెట్టి కూడా ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించ‌నుంది మ‌రి. రామ్‌, లింగుస్వామి కాంబినేష‌న్‌లో ఊర‌మాస్ సినిమా ఒక‌టి తెర‌కెక్క‌నుంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను కూడా రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం నానితో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలోనూ, సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న సినిమాలోనూ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

More News

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

ఫోటోలోని వ్యక్తిని గుర్తించారా? షాక్ అవుతున్న నెటిజన్లు..

ఫోటోలోని వ్యక్తిని చూశారా? గుర్తు పట్టారా? ఆ ఎవరో ఒక రైతులే అనుకుంటున్నారా? లేదు..

టికెట్‌ ఫ్యాక్టరీ & ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్త నిర్మాణం... ప్రొడక్షన్‌ నెం1లో ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్య తారలుగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు

‘లూసీఫర్’ నుంచి తప్పుకున్న నయన్.. ఛాన్స్ కొట్టేసిన త్రిష!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్న విషయం తెలిసిందే.

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది.