రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ఉప్పెనతో శాండిల్‌వుడ్ బ్యూటీ కృతిశెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఎప్పుడైతే సినిమా విడుదలైందో అప్పుడు అవకాశాలు ఉప్పెనలా మారాయి. లేటెస్ట్గా మరో తెలుగు సినిమాలో నటించడానికి ఈ అమ్మడు అగ్రిమెంట్‌పై సైన్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ రీసెంట్గా కృతిశెట్టి ఓకే చేసిన సినిమా ఎవరితోనే కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో. ఈ ఏడాది రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ ఓ ద్విభాషా చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.
రామ్‌కి ఇది తొలి తమిళ చిత్రమవుతుంది. కృతిశెట్టి కూడా ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులనే కాదు, తమిళ ప్రేక్షకులను కూడా పలకరించనుంది మరి. రామ్, లింగుస్వామి కాంబినేషన్లో ఊరమాస్ సినిమా ఒకటి తెరకెక్కనుంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ, సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాలోనూ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments