అర్జున్ రెడ్డి దర్శకుడి తో వైష్ణ‌వ్ తేజ్ పంజా కేతికా శ‌ర్మ షూటింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,August 10 2021]

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో... అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది.

చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగాగారి శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు’’ అన్నారు.

న‌టీన‌టులు: వైష్ణ‌వ్ తేజ్ పంజా, కేతికా శ‌ర్మ త‌దిత‌రులు

More News

స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా - ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు,

ఆసక్తిని రేకెత్తిస్తున్న మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ SSMB28 చిత్రం వివరాలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం

శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం.. హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు.

'SR కళ్యాణమండపం' మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది - చేతన్ భరద్వాజ్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే "RX 100" చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక '105 మినిట్స్'

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం "105 మినిట్స్".