ఏంటి.. ఆ హీరోతో 'ఉప్పెన' డైరెక్టర్ మూవీ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఉప్పెన విజయంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఎమోషనల్ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది.
Also Read: మరో కుటుంబానికి ఆపద్భాంధవుడైన మెగాస్టార్
బుచ్చిబాబు తదుపరి చిత్రం ఎవరితో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పలువురు నిర్మాతలు అతడితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ హీరో కావాలి. అలాంటి సమయంలో ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఎన్టీఆర్ కు బుచ్చిబాబు లైన్ చెప్పి ఒప్పించాడని కూడా వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పట్లో బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబోలో సినిమా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో రెండు మూడేళ్ళ పాటు ఎన్టీఆర్ బిజీ కానున్నాడు. తాజాగా మరో ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ తన కమిట్మెంట్స్ పూర్తి చేసేలోగా బుచ్చిబాబు కూడా రెండు చిత్రాలకు ప్లాన్ చేసుకుంటున్నాడట. తాజాగా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
త్వరలో బుచ్చిబాబు కళ్యాణ్ దేవ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కనుక త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత సూపర్ మచ్చి చిత్రంలో నటించాడు. ఆ చిత్రం చివరిదశ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలాగే కిన్నెరసాని అనే కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com