'పుష్ప' ఒక్కటే పది 'కేజిఎఫ్'లతో సమానం.. ఉప్పెన డైరెక్టర్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బన్నీ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు.
ఇదీ చదవండి: చిక్కుల్లో హైపర్ ఆది.. ద్వంద్వ అర్థాలతో డైలాగ్స్, రగిలిన వివాదం!
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మధ్యన విడుదలైన ఇంట్రడక్షన్ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోందంటే అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఉప్పెన దర్శకుడు పుష్ప చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యే కామెంట్స్ చేశాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు.. సుకుమార్ శిష్యుడు అనే సంగతి తెలిసిందే. బుచ్చిబాబు పుష్ప మొదటి భాగం చూశాడట. దీనితో ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఈ చిత్రం చూశాక తన గురువు సుకుమార్ పై అసూయ కలిగిందని అన్నారు. పుష్ప ఒక్కటే పది 'కేజిఎఫ్' లతో సమానం అని బన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచేశాడు బుచ్చిబాబు. హీరో పాత్ర, ఎలివేషన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయని అన్నారు. ఈ చిత్రం చూశాక బన్నీలా మరెవరూ చేయలేరు అనిపిస్తుంది అని బుచ్చిబాబు అన్నారు.
మైత్రి మూవీస్ సంస్థ పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తోంది. బన్నీ స్మగ్లర్ గా రఫ్ లుక్ లో ఆశ్చర్యపరుస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇంట్రడక్షన్ వీడియోలో అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదేలే'డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com