ప‌రువు హ‌త్య‌లే ప్ర‌ధానంగా 'ఉప్పెన‌'..

  • IndiaGlitz, [Tuesday,May 14 2019]

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు ఈ మ‌ధ్య ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. అదే కోవ‌లో మెగా కాంపౌండ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ సినిమా 'ఉప్పెన‌' తెరకెక్క‌నుంది. ధ‌న‌వంతుల బిడ్డ అయిన హీరోయిన్‌.. చేప‌లు ప‌ట్టే పేద‌వాడైన హీరో మ‌ధ్య ప్రేమ పుడుతుంది. అయితే హీరోయిన్ కుటుంబ స‌భ్యుల‌కు వారి ప్రేమ న‌చ్చదు. దాంతో హీరో హీరోయిన్ ఏం చేశార‌నేదే సినిమా. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై సినిమా నిర్మితం కానుంది. బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ప్ర‌తి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు.