ఐదో రోజు ‘ఉప్పెన’ ఎంత కలెక్ట్ చేసిందంటే..

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఐదవ రోజు సైతం మంచి వసూళ్లను ఈ చిత్రం సాధించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. తొలిసారి దర్శకత్వం వహించినప్పటికీ సినిమాను అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.

మెగా కుటుంబం నుంచి వచ్చిన వారసుడికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేసింది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నాలుగో రోజు కూడా మెగా హీరో అదరగొట్టేశాడు. నైజాంలో తొలిరోజు ఈ సినిమాకు 3.04 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదో రోజు ఈ సినిమా రూ.3.92 కోట్ల షేర్‌ను రాబట్టింది. కాగా.. ఐదు రోజులూ కలిపి మొత్తంగా రూ.????.???? కోట్ల షేర్‌ను ఈ సినిమా రాబట్టింది.

ఐదో రోజు ‘ఉప్పెన’ వసూళ్లు..

నైజాం.. రూ.1.15 కోట్లు
వైజాగ్ రూ. 59 లక్షలు
ఈస్ట్ రూ. 39 లక్షలు
వెస్ట్ రూ. 18 లక్షలు
క్రిష్ణా రూ.19 లక్షలు
గుంటూరు రూ. 24 లక్షలు
నెల్లూరు రూ. 13 లక్షలు
సీడెడ్ రూ. 65 లక్షలు
నైజాం+ ఏపీ రూ. 3.52 కోట్లు
ఓవర్సీస్ రూ.10 లక్షలు
కర్ణాటక రూ.15 లక్షలు
తమిళనాడు రూ.7 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.8 లక్షలు
టోటల్ - 40 లక్షలు

మొత్తం ఐదు రోజుల ‘ఉప్పెన’ వసూళ్లు

నైజాం.. రూ.11.03 కోట్లు
వైజాగ్ రూ. 5.59 కోట్లు
ఈస్ట్ రూ. 3.23 కోట్లు
వెస్ట్ రూ. 1.91 కోట్లు
క్రిష్ణా రూ. 2.2 కోట్లు
గుంటూరు రూ. 2.65 కోట్లు
నెల్లూరు రూ. 1.14 కోట్లు
సీడెడ్ రూ.5.17 కోట్లు
నైజాం+ ఏపీ రూ. 32.92 కోట్లు
ఓవర్సీస్ రూ.1.6 కోట్లు
కర్ణాటక రూ.1.71 కోట్లు
తమిళనాడు రూ.65 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.51 లక్షలు

టోటల్ -4.47 కోట్లు

More News

ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3

సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆచార్య క్రియేషన్స్ ప్రత్యేక గౌరవం, మంచి పేరు తెచ్చుకుంది.

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం స్టార్ట్.. ‘బాహుబలి’ రికార్డ్ బ్రేక్!

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన సినిమా వస్తోందంటేనే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిదీ ఆసక్తికరమే. ప్రస్తుతం రాజమౌళి

ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళపై అత్యాచారం!

ఆస్ట్రేలియా పార్లమెంటులోని రక్షణ మంత్రిత్వశాఖలో ఓ మహిళపై అత్యాచారం జరిగిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సదరు కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని..

శిష్యుడికి ఉప్పెనంత ప్రేమతో!: సుకుమార్

శిష్యుడు ప్రయోజకుడై మంచి స్థాయికి చేరుకుంటే ఆ గురువు కంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. వాడు నా శిష్యుడంటూ చెప్పుకుంటున్నప్పుడు ఆ గురువు కళ్లల్లో ఓ మెరుపు మెరుస్తుంది.