వసూళ్ల ‘ఉప్పెన’ కొనసాగిస్తున్న మెగా హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు సాధించి అద్భుతమైన కలెక్షన్లను మలిరోజు సైతం కొనసాగించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.
తొలిరోజే 10 కోట్లకు పైగా షేర్ రావడం అనేది ఒక డెబ్యూట్ హీరోకి అద్భుతమైన విషయమే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వారసుడికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేసింది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రెండో రోజు కూడా మెగా హీరో అదరగొట్టేస్తున్నాడు. నైజాంలో తొలిరోజు ఈ సినిమాకు 3.04 కోట్ల షేర్ వచ్చింది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో సినిమాకు మరింత అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు ఈ సినిమా రూ.18.77 కోట్ల షేర్‌ను రాబట్టింది.
రెండోరోజు ‘ఉప్పెన’ వసూళ్లు..
నైజాం.. రూ.5.75 కోట్లు
వైజాగ్ రూ. 2.67 కోట్లు
ఈస్ట్ రూ. 1.63 కోట్లు
వెస్ట్ రూ. 1.13 కోట్లు
క్రిష్ణా రూ. 1.10 కోట్లు
గుంటూరు రూ. 1.42 కోట్లు
నెల్లూరు రూ. 0.58
సీడెడ్ రూ. 2.45 కోట్లు
నైజాం+ ఏపీ రూ. 16.73 కోట్లు
ఓవర్సీస్ 70 లక్షలు
కర్ణాటక రూ.86లక్షలు
తమిళనాడు 30 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments