మెగా హీరో సినిమాలో ఉపేంద్ర
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది `ఎఫ్ 2`, `గద్దల కొండ గణేష్` చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న యువ హీరో వరుణ్ తేజ్. డిపరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వరుణ్ తేజ్ రెండు కమర్షియల్ చిత్రాల తర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వైజాగ్‌లో చిత్రీకరించాల్సిన ఈ సినిమా మేజర్ షెడ్యూల్ వాయిదా పడింది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపేంద్ర ఈ విషయాన్ని ఖరారు చేశారు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తనకు అన్నీ విలన్ పాత్రలే వచ్చాయని అందుకనే తాను నటించలేదని ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. అంటే వరుణ్ సినిమాలో ఉపేంద్రది విలన్ రోల్ కాదన్నమాట.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. కాగా.. సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడేలా కనిపిస్తుంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర ప్రత్యేకమైన శిక్షణను తీసుకుంన్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి.. వరుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడతాడేమో వేచి చూడాలి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments