స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్న ఉపేంద్ర
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ హీరో, రాజకీయ నాయకుడు ఉపేంద్ర బెంగళూరులో ఉద్యమానికి తెర తీశాడు. కన్నడిగులకే ప్రభుత్వం ఉద్యోగాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ``స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అందుకోసం నేను పోరాటం చేయబోతున్నాను. ఈ నెల 14,15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేయబోతున్నాను. దీనికి యువత మద్దతుగా నిలవాలని కోరుతున్నాను`` అని వీడియోలో ఉపేంద్ర చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఉపేంద్ర గట్టిపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. కొన్ని రోజుల కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన గళమెత్తారు. ఆగస్ట్ 9న అవినీతపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేయడమే కాకుండా అధునిక టెక్నాలజీతో అవినీతిని అంతం చెయవచ్చుని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments